Chris Gayle, in a series of tweets, has promised a tell-all interview against an media group that accused him of exposing himself in front of a massage therapist on one condition – only if the price is right. <br /> <br />తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తప్పుడు కథనాలు ప్రచురించిందని ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ మీడియాపై వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పరువు నష్టం దావా వేయడం... ఈ కేసులో గేల్‌కు కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగిన సంగతి తెలిసిందే.ఈ కేసులో క్రిస్ గేల్ ఓ మహిళా మసాజ్ థెరపిస్ట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆ మీడియా సంస్థ చేసిన ఆరోపణల్ని కోర్టు కొట్టివేస్తూ ఎన్ఎస్‌డబ్ల్యూ సుప్రీం కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖర్చు అవుతుందన్నాడు. <br />ఇందులో సినిమాను తలపించే మలుపులున్నాయని.. అవన్నీ చెప్పాలంటే తనకు కనీసం 3 లక్షల డాలర్లు చెల్లించాలని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఇది చెప్పేందుకు ప్రత్యేకంగా 60 నిమిషాలు పడుతుందని అన్నాడు. అలా కాదంటే తాను పుస్తకం రాసే వరకు ఎదురు చూడాల్సిందేని క్రిస్ గేల్ పేర్కొన్నాడు.2015 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ వరల్డ్ కప్ సందర్భంగా క్రిస్ గేల్ డ్రస్సింగ్ రూమ్‌లో మహిళా మసాజ్ థెరపిస్ట్ రస్సెల్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గతేడాది జనవరిలో ఫెయిర్‌ఫాక్స్ మీడియాకు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్‌బెర్రా టైమ్స్ వరుస కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలపై క్రిస్ గేల్ మసాజ్ థెరపిస్ట్‌తో నేను తప్పుగా ప్రవర్తించలేదని. మీడియాలో వచ్చిన ఆ వార్తలు నన్ను ఎంతగానో బాధించాయని పేర్కొన్నాడు. దీనిపై తాను పోరాడాల్సి ఉందని, ఫెయిర్ ఫాక్స్ మీడియా సంస్ధపై పరువు నష్టం దావా వేశాడు.